మాస్కుల్లేని ప్రయాణికులను అనుమతించొద్దు: ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలు

08-06-2022 Wed 20:15 | National
  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
  • తాజా మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ
  • మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని తాజా కేసుల సరళి చెబుతోంది. దేశంలో మళ్లీ వేలల్లో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, విమాన ప్రయాణాల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. మాస్కులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను ఏమాత్రం ఉపేక్షించకుండా విమానాల నుంచి కిందికి దించేయాలని పేర్కొంది. విమానాశ్రయాల్లోనూ కరోనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపింది. 

ఎయిర్ పోర్టుల్లోనూ, విమానాల్లోనూ మాస్కులు ధరించనివారి పట్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో డీజీసీఏ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 

కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించే అధికారం ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, ప్రత్యేక సందర్భాల్లోనే మాస్కులు తీసేసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.
DGCAMasksAirlinesCorona ProtocalDelhi High CourtIndia

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more